Mon Nov 18 2024 07:47:57 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : అందుకే సామీ.. క్యాచ్ వస్తే.. పట్టుకోవాలి.. చేజారింది.. పంజాబ్ చాపచుట్టేసింది
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పై పంజాబ్ కింగ్స్ ఓటమి పాలయి ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది.
ఐపీఎల్ లో ప్లేఆఫ్ ఆశలు నిలుపుకునేందుకు జట్లు అన్నీ ప్రయత్నిస్తున్నాయి. అయితే ఏ ఒక్క నాలుగు జట్లు మాత్రమే ప్లే ఆఫ్ కు క్వాలిఫై అవుతాయి. అందుకే వీరపోరాటం చేస్తున్నాయి. ఇప్పటి వరకూ జరిగింది ఒక ఎత్తు. ఒక జరగబోయేది మరొక ఎత్తులా ఐపీఎల్ మ్యాచ్ లు నడుస్తున్నాయి. అయితే ఇందులో జట్టులో సమన్వయ లోపం కొందరిని ఓటమి బాట పట్టిస్తుంది. కొన్ని సార్లు జట్టులో కొందరు ఆటగాళ్లు చేసిన తప్పులే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఒక క్యాచ్ మిస్ అయితే అది కొంపముంచుతుందని చివరకు ఓడిపోయిన తర్వాత కానీ తెలియదు. ఆ క్యాచ్ మిస్ చేయడం వల్ల ఎంత కోల్పోయామో తర్వాత తెలుస్తుంది.
రెండుసార్లు...
నిన్న జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో పంజాబ్ కింగ్స్ లోనూ అదే జరిగింది. విరాట్ కోహ్లి మ్యాచ్ ఒకసారి కాదు. రెండుసార్లు మిస్ చేశారు. అదే పంజాబ్ ఓటమికి కారణం అని చెప్పాలి. అసలే విరాట్ కోహ్లి ఈసీజన్ లో ఫుల్లు ఫామ్ లో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో కోహ్లి ఇచ్చిన క్యాచ్ చేజార్చుకుంటే దాని పరిణామం పంజాబ్ కు ఓటమి తప్పలేదు. విరాట్ ఇక ఊరుకుంటాడా? చెలరేగి ఆడాడు. దీంతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ పై పంజాబ్ కింగ్స్ ఓటమి పాలయి ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్ ఫ్యాన్స్ కు మంచి ఫీస్ట్ అందించిందనేే చెప్పాలి. తొలుత బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టులో ఓపెనర్లలో డూప్లెసెస్ త్వరగా అవుటయినా రజిత్ పాటీదార్ చెలరేగి ఆడటంతో పది ఓవర్లలోనే వంద పరుగులు దాటేసింది.
లక్ష్య సాధనలో...
అప్పుడే భారీ స్కోరు చేస్తుందని అందరూ అంచనా వేశారు. జల్లులు పడటంతో కొద్దిసేపు ఆట ఆగినా రజిత్ పాటేదార్ అవుట్ అయిన తర్వాత వర్షం పడటంతో కొంత మేలు జరిగింది. విరాట్ కోహ్లి 47 బంతుల్లో 92 పరుగులు చేశాడు. రజిత్ పాటీదార్ 23 బంతుల్లోనే 55 పరుగులు చేశాడు. కామెరరూన్ గ్రీన్ 46 పరుగులు చేయడంతో జట్టు స్కోరు మరింత పెరిగింది. ఇరవై ఓవర్లలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఏడు వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. అతి పెద్ద స్కోరును అధిగమించే లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ కేవలం 17 పరుగులకే చాపచుట్టేసింది. 181 మపరుగుుల మాత్రమే చేసింది. బెంగళూరు జట్టు ప్లేఆఫ్ ఆశలు సజీవంగా నిలుపుకోగా, పంజాబ్ కింగ్స్ ఆట నుంచి వైదొలిగింది. ఆ రెండు క్యాచ్ లలో ఒకదానిని పట్టుకుని ఉంటే పంజాబ్ పరిస్థితి వేరేలా ఉండేది.
Next Story